Pawan with Modi: ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ..! 25 d ago
ప్రధాని నరేంద్ర మోడీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పార్లమెంట్ భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనతో సమావేశం అయ్యారు. జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ పథకం కాల పరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోడీతో చర్చించారు. మరోవైపు పవన్ ను బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, టీడీపీ ఎంపీలు కలిశారు.